సొంత తమ్ముడితో అన్నా అంటూనే సాంగ్ రీ క్రియేట్.. మీ బాండింగ్ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్(వీడియో)

by I. Sairam |

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం ‘కింగ్డమ్’(Kingdom) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సొంత తమ్ముడితో అన్నా అంటూనే సాంగ్ రీ క్రియేట్.. మీ బాండింగ్ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం ‘కింగ్డమ్’(Kingdom) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో భాగ్యశ్రీ బోర్సే(Bhagyasre Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీ ఈ నెల 31న థియేటర్లలో రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ రీసెంట్‌గా కింగ్డమ్ నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. అన్నా అంటూనే సాంగ్‌ను విడుదల చేయగా.. లిరిక్స్ మనసుకు హత్తుకునేలా ఉంది. అయితే ఈ మూవీలో విజయ్‌కు అన్నగా హీరో సత్యదేవ్(Sathyadev) యాక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) తన ఇన్ స్టాగ్రామ్‌లో తన అన్న విజయ్ దేవరకొండతో ఉన్న ఫొటోని షేర్ చేశాడు. దానితో పాటు అన్నా అంటూనే అనే సాంగ్‌ని దానితో యాడ్ చేశాడు. ఇందులో తన బ్రదర్‌తో ఉన్న చైల్డ్ మెమరీస్ అన్నిటినీ ఒకచోట చేర్చి ఈ సాంగ్ ప్లే చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు ఈ వీడియోను ఆనంద్‌తో పాటు విజయ్ కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేయడం విశేషం. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. మీ బాండింగ్ అదుర్స్ అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story