- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mad Square: అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఐటెమ్ సాంగ్?
దిశ, సినిమా: నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeet Shobhan), రామ్ (ram) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ (box office) వద్ద సూపర్ సక్సెస్ అందుకున్న ‘మ్యాడ్’ కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కల్యాన్ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మ్యాడ్’ సూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు వస్తున్న సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలోకి మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
‘సామజవరగమన’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రెబా మోనికా జాన్ (Reba Monica John).. మొదటి చిత్రంతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తర్వాత మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఈ బ్యూటీ.. ప్రజెంట్ మ్యాడ్ స్క్వేర్‌లో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే.. దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ ప్రజెంట్ రెబా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.