- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RC 17: అప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్.. మూవీ బృందం నుంచి సూపర్ అప్డేట్
మైత్రి సీఈవో చెర్రీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జూన్ నెల నుంచి చరణ్-సుకుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘RC 17’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చాలా రోజుల క్రితమే వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన చివరి పాట షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. దీంతో ఎప్పటి నుంచి చరణ్–సుకుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ తాజాగా వచ్చింది. చరణ్–సుకుమార్ కాంబో మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఆ బ్యానర్ సీఈవో చెర్రీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇక ‘పెద్ది’ సినిమాను కూడా జూన్‌లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ‘పెద్ది’ షూటింగ్ పూర్తి కాగానే రామ్ చరణ్ నేరుగా సుకుమార్ ప్రాజెక్ట్‌లో జాయిన్ కానున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






