- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా నాన్న జయంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేస్తున్నాం.. ‘రేజర్’ విడుదల డేట్ ప్రకటించిన డైరెక్టర్
మా నాన్న జయంతి సందర్భంగా ‘రేజర్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాము అని ప్రకటించాడు డైరెక్టర్, నటుడు రవిబాబు.

దిశ, సినిమా: టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు.. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా ‘రేజర్’తో రాబోతున్నాడు. న్యాయం అనేది చాలా పచ్చిగా, క్రూరంగా ఉంటుందనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి రవిబాబు దర్శకత్వం వహిస్తూ.. ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన కీలక షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తికాగా.. పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో తాజాగా సినిమా రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మే 8న గ్రాండ్ థియేట్రికల్‌కు రాబోతున్నట్లు తెలిపారు. అయితే.. మే 8న రిలీజ్ చేయడంపై డైరెక్టర్, నటుడు రవిబాబు మాట్లాడుతూ.. ‘నా తండ్రి చలపతి రావు జయంతిని పురస్కరించుకుని మే 8న మా సినిమా ‘రేజర్’ను ప్రపంచం వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాము’ అని తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.






