Ravi Teja: ఆ పండుగ స్పెషల్‌గా రాబోతున్న మాస్ జాతర.. ఆనందంలో ఫ్యాన్స్!

by Chukka Sudharani |   (  Updated:2025-05-27 14:49:13  IST  )

మాస్ మహారాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’.

Ravi Teja: ఆ పండుగ స్పెషల్‌గా రాబోతున్న మాస్ జాతర.. ఆనందంలో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరకు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ ఫర్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా మే-9 2025న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, షూటింగ్, తదితర ఇష్యూస్ కారణంగా ‘మాస్ జాతర’ రిలీజ్ వాయిదా పడింది. కానీ ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అప్‌డేట్ మాత్రం ఇవ్వలేదు చిత్ర బృందం.

ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘మాస్ జాతర’ సినిమా ఈ ఏడాది వినాయక చవితి స్పెషల్‌గా ఆగస్టు 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దాదాపు ఇదే డేట్ ఫిక్స్ కాగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story