- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ ‘ఇరుముడి’ నుంచి బిగ్ సర్ప్రైజ్.. ‘పెద్ది’తో గ్లింప్స్
ఈ వారంలోనే ఇరుముడి చిత్ర గ్లింప్స్ వీడియోను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇరుముడి చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా కనిపించనుండగా, దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంగీత బాధ్యతలను జీవీ ప్రకాష్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వారంలోనే ఇరుముడి చిత్ర గ్లింప్స్ వీడియోను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ గ్లింప్స్‌ను పెద్ది సినిమాతో అటాచ్ చేసి థియేటర్లలో కూడా ప్రదర్శించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వరుస అపజయాలతో కాస్త డీలా పడిపోయిన రవితేజకు ఈ సినిమా కీలకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఇరుముడి చిత్రంతో రవితేజ మళ్లీ విజయాల బాట పట్టి ఫామ్‌లోకి వస్తాడా లేదా అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కనిపిస్తోంది.






