- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandla Ganesh: రవితేజకు అబద్ధం చెప్పి పెద్ద మోసం చేశా.. ఆ తర్వాత అలాంటి పరిస్థితి
బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రవితేజ గారిని మోసం చేసి ఒక స్థలాన్ని కొనుక్కున్నాను, ఆ విషయం ఆయనకు చెబితే చాలా ఫన్నీగా తీసుకున్నారు అని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: బండ్ల గణేష్ నటుడిగా కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. ఈయన తన కెరీర్లో నిర్మించినది తక్కువ సినిమాలే అయినా కూడా అవి ఆల్మోస్ట్ స్టార్ హీరోలతో మాత్రమే కావడం విశేషం. మాస్ మహారాజా రవితేజ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఆంజనేయులు మూవీతో ఈ నటుడు నిర్మాతగా తన కెరీర్ను మొదలు పెట్టాడు.
ఆ తర్వాత తీన్‌మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ నటన మరియు సినిమాలు నిర్మించడం విషయంలో కూడా చాలా స్లో అయ్యాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి హీరోగా రూపొందబోయే సినిమాలో నటిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. అలాగే నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, కానీ వచ్చిన ప్రతి సినిమాలో నటించాలి అనే కోరిక నాకు లేదు. ప్రస్తుతం నేను చాలా పనులతో బిజీగా ఉన్నాను, కేవలం నాకు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని తెలియజేశాడు.
బండ్ల గణేష్ చాలా కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందులో ఈ నిర్మాత... నాకు ఎంతో నచ్చిన మనిషి, నటుడు రవితేజ. కానీ ఆయనను ఓ విషయంలో నేను మోసం చేశాను. కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ గారి దగ్గర ఉన్న ఒక స్థలాన్ని ప్రభుత్వం అక్యూజేషన్ చేస్తుందని అబద్ధం చెప్పి కొనుగోలు చేశాను. ఆ తర్వాత ఆ విషయం ఆయనకు చెప్పాను, ఆయన సీరియస్ అవుతారు అనుకున్నాను. కానీ నాకు ఆ విషయం ముందే తెలుసు అని చాలా ఫన్నీగా తీసుకున్నారు. అంత గొప్ప మనసు ఆయనది అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.






