- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పేసిన రవితేజ..
మాస్ మహారాజా రవితేజ(Raviteja), కిషోర్ తిరుమల(Kishore Tirumala) కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ(Raviteja), కిషోర్ తిరుమల(Kishore Tirumala) కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఇక దీన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తుండగా.. ఇందులో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో స్టార్ హీరో రవితేజ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను కొంత మందితో చేసిన సినిమాలు హిట్ ప్లాఫ్‌లు పక్కన పెట్టండి. కానీ వాళ్ళతో సినిమా చేసినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేశాను. వారిలో అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబి, కిషోర్.. వీరి డైరెక్షన్లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను.
నెక్స్ట్ శివ నిర్మాణంతో చేస్తున్నాను. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. మంచి ఇదితో వస్తున్నాడు. వీళ్ళు చేసే యాక్ట్ కింద మనం 50 పర్సెంట్ చేసినా సినిమా సూపర్‌గా వస్తుంది. ముఖ్యంగా బాబీ చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే ఈ మూవీ చాలా ఫుల్ ఫన్‌గా ఉంటుంది. జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్స్‌లో కలుద్దాం’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






