- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాంగ్ గ్యాప్ తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో రవితేజ.. దర్శకుడు ఎవరో తెలుసా?
by Pulgam srinivas |
రవితేజ హీరోగా, హసీత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: రవితేజ–దిల్ రాజు కాంబినేషన్‌లో మొదటగా 'భద్ర' సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన 'రాజా ది గ్రేట్' కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా రాలేదు. ఇక తాజాగా వీరి కలయికలో ఓ మూవీ సెట్ అయినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రస్తుతం రవితేజతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు, దానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ హాసిత్ గోలి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితమే ఈ యువ దర్శకుడు రవితేజ, దిల్ రాజులకు ఓ స్టోరీ వినిపించగా, అది వారికి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్ని సజావుగా జరిగితే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






