సింగర్‌ను రెండో పెళ్లి చేసుకోబోతున్న రవి మోహన్.. ఒక్క పోస్ట్‌తో హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందిగా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-11 08:08:52  IST  )

కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi) (రవి మోహన్)సినిమాల్లో నటించిన దానికంటే తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.

సింగర్‌ను రెండో పెళ్లి చేసుకోబోతున్న రవి మోహన్.. ఒక్క పోస్ట్‌తో హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందిగా?
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi) (రవి మోహన్)సినిమాల్లో నటించిన దానికంటే తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఆయన సడెన్‌గా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేయడంతో అంతా షాక్ అయ్యారు. కానీ ఆ విడాకులు ఆమెకు తెలియకుండా జరుగుతున్నాయని అనడంతో అది కాస్త సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత ఎవరి పనుల్లో వారున్నారు. ఇక ఇటీవల ఆయన తన పేరును కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. రవి మోహన్ అని పెట్టుకోగా.. గత కొద్ది రోజుల నుంచి సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌(Kenisha Francis)తో డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈనేపథ్యంలో.. రవి ఆమెతో కలిసి ఒకే కలర్ దుస్తుల్లో ఓ పెళ్లికి హాజరుకావడంతో పాటు భార్యభర్తగా సన్నిహితంగా ఫొటోలు దిగడంతో డేటింగ్ పుకార్లకు బలం చేకూరినట్లు అయింది. ఇక వాటిని చూసిన నెటిజన్లతో పాటు రవి మోహన్ భార్య ఆర్తి షాక్‌కు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ తనను మోసం చేశాడని తన పిల్లల బాధ్యత కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. ఆమెకు పలువురు సినీ సెలబ్రిటీలు సపోర్ట్‌గా నిలుస్తూ పోస్టులు పెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆర్తి పెట్టిన పోస్ట్‌కు కెనిషా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇండైరెక్ట్‌గా ఓ కొటేషన్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ఒక మగాడు ఎప్పుడూ ఎమోషన్స్‌కు లొంగడు.

ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. సైలెంట్‌గా మంచిగా ఉన్నాను కదా అని లైట్ తీసుకోకు. అదే నా నిజమైన బలం’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక గత రెండు రోజుల క్రితమే పెళ్లిలో కనిపించిన రవి మోహన్ కెనిషా మరోసారి మీడియా కంట పడ్డారు. మళ్లీ ఓ ఈవెంట్‌లో కనిపించారు. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంతలా బరితెగించాడేంటని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చారని గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Next Story