- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ravi Babu: ఆ సినిమాకు విజయ్ నా మొదటి ఎంపిక.. కానీ జరగలేదు
విజయ్ దేవరకొండతో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేదా విభేదాలు లేవని నటుడు, దర్శకుడు రవిబాబు స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రవిబాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొంతకాలం క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా, "మీకు విజయ్ దేవరకొండతో కొన్ని మనస్పర్థలు వచ్చాయని, మీపై వచ్చిన కోపంతోనే ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇందులో నిజం ఉందా? లేక అవన్నీ రూమర్లేనా?" అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రవిబాబు స్పందిస్తూ.. నాకు, విజయ్ దేవరకొండకు ఎలాంటి మనస్పర్థలు లేవు.
నేను దర్శకత్వం వహించిన 'నువ్విలా' చిత్రంలో ఆయన నటించాడు. ఆ తర్వాత నేను రూపొందించిన కొన్ని ప్రకటనల్లో కూడా ఆయన నటించాడు. అనంతరం 'అవును' సినిమాలో హీరోగా అతడినే అనుకున్నాం. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అది కుదరలేదు. ఇక ఆయన హీరోగా నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాలో నేను నటించాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని రవిబాబు స్పష్టం చేశారు. ఇక తాజాగా రవిబాబు 'రేజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక నిరాశపరిచింది.






