- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీని “పెంట పెంట” చేస్తున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రవిబాబు
రవిబాబు మాట్లాడుతూ... ప్రమోషన్ల పేరుతో కొంతమంది ఇండస్ట్రీని “పెంట పెంట” చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు తాజాగా నటించిన “రేజర్” సినిమా మే 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్లపై ఆయన ఘాటుగా స్పందించారు. కొంతమంది ప్రమోషన్ల పేరుతో ఇండస్ట్రీని “పెంట పెంట” చేస్తున్నారని అన్నారు. టీజర్‌కు ప్రీ టీజర్, ప్రీ టీజర్‌కు గ్లింప్స్, దానికి ఒక అనౌన్స్‌మెంట్ డేట్, దానికి మళ్లీ ఫ్రీ అనౌన్స్మెంట్ డేట్ అంటూ అనవసరమైన హడావుడి చేస్తూ ప్రేక్షకులను విసిగిస్తున్నారని విమర్శించారు. “జనాలకు పని పాట లేదనుకుంటున్నారా? అవసరం లేని ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే వాళ్లకు చిరాకు మాత్రమే వస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. పాత రోజుల్లో గోడలపై పోస్టర్లు వేసినా జనాలు థియేటర్లకు వచ్చేవారని, ఇప్పుడు ఎన్నో ప్రమోషన్లు చేసినా ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం బాధాకరమని చెప్పారు. సింపుల్‌గా ఒక రిలీజ్ డేట్ చెప్పి ట్రైలర్ వదిలేస్తే సరిపోతుందని, అనవసరపు హడావుడి తగ్గించాలని రవిబాబు సూచించారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






