- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ravi Babu: పిచ్చి కోపంతో కృష్ణవంశీ గారితో అలా అన్నాను.. ఆయన మాటలకు నేను షాక్ అయ్యా
రవిబాబు మాట్లాడుతూ… తాను నటించిన మురారి సినిమాలో చాలా రోజులు తనపై ఎలాంటి సన్నివేశాలు కూడా చిత్రీకరించలేదని ఆయన వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: నటుడు, దర్శకుడు రవిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపును తీసుకువచ్చిన మురారి మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రవిబాబు మాట్లాడుతూ.. కృష్ణవంశీ గారు మురారి సినిమా కంటే ముందే తనకు పరిచయం. ఆ సినిమాలో ఓ పాత్ర కోసం తనను సంప్రదించి, కొన్ని డేట్స్ కూడా తీసుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత తాను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సెట్స్‌కు వెళ్లి, సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉండేవాడినని, కానీ తనపై ఒక్క సన్నివేశం కూడా చిత్రీకరించేవారు కాదు. చాలా రోజులు ఇలా గడవడంతో నాకు బాగా కోపం వచ్చింది.
ఒక రోజు కృష్ణవంశీ గారి దగ్గరకు వెళ్లి ‘నన్నెందుకు పిలిచారు? ఎందుకు కూర్చోబెడుతున్నారు? నా డేట్స్ తీసుకున్నారు కానీ నాపై ఒక్క సీన్ కూడా షూట్ చేయడం లేదు’ అని గట్టిగా అడిగాను. దానికి కృష్ణవంశీ గారు మొదట పెద్దగా స్పందించలేదని, అయితే కొన్ని రోజుల తర్వాత తన దగ్గరకు వచ్చి ఓ సన్నివేశం గురించి వివరించారని చెప్పారు. “మహేష్ బాబు, సోనాలి బింద్రే ఇద్దరూ నడుచుకుంటూ వస్తుంటారు. నువ్వు ముందుగా మహేష్ బాబును చూసి భయపడితే ఎలా యాక్ట్ చేస్తావో అలా చేయమన్నారు. దాంతో నేను భయపడినట్టు యాక్ట్ చేశాను. అందులో కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా వచ్చాయి. అది కృష్ణవంశీ గారికి బాగా నచ్చింది. ఆ తర్వాత నుంచి నాపై సన్నివేశాలు బాగానే చిత్రీకరించారు” అని రవిబాబు చెప్పుకొచ్చారు.






