- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా ప్రేమ నిజమైతే నువ్వు మళ్లీ వస్తావనుకుంటున్నా.. జీవితాంతం నిన్ను మిస్ అవుతానంటూ రష్మి ఎమోషనల్ పోస్ట్
బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Gautam) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Gautam) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. నంబర్ వన్ షో జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చి యాంకర్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి వరుస షోస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రష్మి, సుధీర్(Sudheer) ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. దానికి కారణం వీరిద్దరు కలిసి పలు షోలు చేయడంతో పాటు బుల్లితెరపై రీల్ పెళ్లి కూడా జరిపించుకున్నారు. అలాగే జంటగా పలు ఫర్మార్మెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో వీరిద్దరు ప్రేమించుకుంటున్నారనే ప్రచారం కొద్ది కాలంగా ట్రెండింగ్‌లో ఉంది.
ఎన్నోసార్లు వీరు స్పందించినప్పటికీ ఇప్పటికీ సుధీర్ రష్మిలకు సంబంధించిన వార్త లెన్నో నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే.. రష్మి ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలతో పాటు జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల తన పెట్ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా, రష్మి తన పెట్ అస్తికలను గోదావరి నదిలో కలిపింది. అలాగే తన పెట్ చుట్కీ వీడియోలను షేర్ చేస్తూ రష్మి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నిన్ను ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్ళు చుట్కీ గౌతమ్’’ అనే క్యాప్షన్ జత చేసింది.






