- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థాంక్యూ మీట్‌కు హాజరుకాకపోవడంపై రష్మిక స్పందన.. హార్ట్ ఎమోజీతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

దిశ,వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఛలో’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన ఫస్ట్ మూవీతోనే నేసనల్ క్రష్ పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇక సుకుమార్ దర్శకత్వం(Directed by Sukumar)లో వచ్చిన ‘పుష్ప’ మూవీ(Pushpa Movie)తో ఏకంగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
అయితే రీసెంట్‌గా పుష్ప మూవీకి సిక్వేల్‌గా వచ్చిన ‘పుష్ప-2 ది రూల్’(Pushpa 2) మూవీలో కూడా ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) సరసన మరోసారి జతకట్టి అలరించింది. తన అందం, నటన, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప 2' సినిమా బాక్సాఫీస్(Box Office) వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్(Worldwide)గా రూ.1900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ మూవీలో సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఇక నిన్న(శనివారం) సాయంత్రం హైదరాబాద్(Hyderabad)లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. 'పుష్ప 2' థ్యాంక్యూ మీట్‌లో కేవలం చిత్ర యూనిట్ సభ్యులు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియాను కూడా ఆహ్వానించలేదు. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar), దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad)తో పాటు సినిమాలో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ పాల్గొన్నారు. అయితే హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న హాజరు కాలేకపోయింది.
ఈ నేపథ్యంలో రష్మిక స్పందిస్తూ.. సోషల్ మీడియా(Social Media) ద్వారా 'పుష్ప 2' అనుభవాలను నేషనల్ క్రష్ రష్మిక మందన్న పంచుకుంది. చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ థాంక్స్ నోట్(Thanks Note) షేర్ చేసింది. ‘‘సుకుమార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కలిసి తమ శ్రమతో ఇలాంటి అద్భుతాన్ని అందించినందుకు థాంక్స్ చెప్పారు. శ్రీవల్లి హృదయంలో తమకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగం చేసినందుకు, గుర్తుండిపోయే రోల్ ఇచ్చినందుకు మరోసారి థాంక్యూ’’ అంటూ రష్మిక తన నోట్‌లో రాసుకొచ్చింది. దీనికి హార్ట్ ఎమోజీలను(Heart Emoji) కూడా జత చేసింది.






