- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
6 ఇయర్స్ కంప్లీట్ అంటూ అతనితో ఆ పని చేస్తున్న ఫొటో షేర్ చేసిన రష్మిక.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)- రష్మిక మందన్న(Rashmika Mandanna)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)- రష్మిక మందన్న(Rashmika Mandanna)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు కలిసి ‘గీత గోవిందం’(Geetha Govindam), ‘డియర్ కామ్రేడ్’(Dear Comrade) మూవీల్లో నటించారు. అయితే ఆన్‌స్క్రీన్ వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఆఫ్‌స్క్రీన్ కూడా వీరిద్దరు పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. అనుకున్న విధంగానే ఈ జంట వెకేషన్స్, పార్టీస్, పండుగలు చేసుకున్న ఒకే దగ్గర చేసుకోవడం వాటికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడం జరుగుతూ ఉంది. మొన్న రీసెంట్‌గా కూడా ఇద్దరు ఒకే కారులో వెళ్తుండతం కనిపించింది.
ఇంత జరిగినా ఈ జంట తమ రిలేషన్ షిప్ పై ఓపెన్ అప్ కాలేదు. ఈ క్రమంలో రష్మిక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో డియర్ కామ్రెడ్ మూవీ షూటింగ్ టైంలో తీసుకున్న కొన్ని క్యూట్ పిక్స్‌ను షేర్ చేసింది. అంతేకాకుండా విజయ్‌తో డ్యాన్స్ చేస్తున్న ఓ పిక్‌ను కూడా షేర్ చేస్తూ.. ‘6 సంవత్సరాల డియర్ కామ్రేడ్.. ఎంతో ప్రేమ, ఆనందం, సానుకూలత అండ్ మరిన్ని ప్రేమతో నిండిన సినిమా. ఇవి చాలా సంవత్సరాల క్రితం తీసిన కొన్ని ఫొటోలు, నా ఫోన్‌లో ఇప్పటికీ ఉన్నాయి.
నేను వాటిని తిరిగి చూసుకుంటూ ఉంటాను.. నేను ఎంత అందమైన సమయాన్ని గడిపానో అండ్ ఈ సినిమా షూటింగ్‌లో మనమందరం ఎంత అందమైన జ్ఞాపకాలను గడిపామో ఆలోచిస్తున్నాను. ఈ సినిమాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే ఒక్క ప్రేమ’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ డియర్ కామ్రేడ్ మూవీ 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందని హ్యాపీగా ఫీలవుతున్నారు.






