- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి(Dheekshith Shetty) సరసన రష్మిక నటిస్తున్న తాజా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend). ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్(Geetha Arts), మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.
తాజాగా, ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘నదివే’ ప్రోమో రిలీజ్ చేస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ‘ఈ మెలోడి మిమ్మల్ని కౌగిలించుకుంటుంది.. #TheGirlfriend మొదటి సింగిల్ మ్యూజిక్ వీడియో ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదలవుతోంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో రష్మిక, దీక్షిత్ శెట్టి డ్యాన్స్ చేస్తున్న ఓ పోజు ఆకట్టుకుంటుంది. కాగా నదివే(తెలుగు), హుయిరే(హిందీ), నదియే(తమిళ్), స్వరవే(కన్నడ), నెలవే(మలయాళం) భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ కానుంది.






