- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna: రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’.

దిశ, సినిమా: రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో రాబోతున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీస్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్‌లోకి రావాల్సి ఉండగా.. వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్.
ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇందులో.. రష్మిక అండ్ దీక్షిత్ రిలేషన్ గురించి మాట్లాడుకుంటూ.. ‘నేను నీ టైపేనా.. అసలు ఒకరికొకరు కరెక్టేనా అని ఎలా తెలుస్తుంది.. ఎప్పుడు తెలుస్తుంది’ అని అనుకుంటారు. దీనికి సరైన సమాధానం కావాలంటే.. నవంబర్ 7న థియేటర్స్‌కి రండి అక్కడ మాట్లాడుకుందాం.. అంటూ ఈ సినిమా ఈఏడాది నవంబర్ 7న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ అండ్ మలయాళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ది గర్ల్‌ఫ్రెండ్ సంభాషణ నెట్టింట విశేషంగా వైరల్ అవుతున్నది. లింక్






