- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైనల్‌గా రిలీజ్‌కు సిద్ధమైన విజయ్ దేవరకొండ మూవీ.. లవ్ సింబల్స్‌తో స్పెషల్ ట్వీట్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’.

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ టబు ప్రధాన పాత్రలో అలరించనుంది. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా గ్రాండ్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొనగా.. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ.. ఎప్పటికప్పుడు ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. జులై 31 ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ క్రమంలోనే చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ రష్మిక మందన్న తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. ‘మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు.. దీని గురించి హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోండి.. జులై 31న ఒక పెద్ద వేడుకగా ఉండబోతోంది’ అంటూ లవ్ సింబల్స్ షేర్ చేసింది ఈ బ్యూటీ. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది. లింక్






