- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాను సినిమాగానే చూడాలి..దానివల్ల ప్రభావితం కాకూడదు.నేషనల్ క్రష్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా, నిజ జీవితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా, నిజ జీవితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నిజ జీవితంలో యానిమల్‌లో హీరో పాత్ర స్వభావం ఉన్న వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారా.. అతడిలో మార్పు తీసుకురాగలరా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నిజానికి సినిమాను సినిమాలాగే చూడాలి. అందులో పాత్రలకు ప్రభావితం కాకూడదు అనేది నా అభిప్రాయం. అలాగే.. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే.. అంతే నిజాయితీగా మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మార్పు కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతాను.
ఎందుకంటే భాగస్వామితో కలిసి ఉంటున్నప్పుడు వారితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు వస్తుంది. ఒకరికి ఒకరు అభిప్రాయాలు పంచుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారు. ఒకరి కోసం ఒకరు మారతారు. మీ ప్రాణ స్నేహితుడితో కానీ మీ భాగస్వామితో కానీ కొంతకాలం కలిసి ప్రయాణించాక అకస్మాత్తుగా పాత రోజులను గుర్తు చేసుకుంటే వారి కోసం మీరు ఎంతలా మారారో అర్థమవుతుంది. ఆ మార్పునకు ఒక్కోసారి మీరే ఆశ్చర్యపోతారు’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది.






