Rashmika Mandanna: గర్ల్‌ఫ్రెండ్ రాబోతున్నది.. రష్మిక మందన్న పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’.

Rashmika Mandanna: గర్ల్‌ఫ్రెండ్ రాబోతున్నది..  రష్మిక మందన్న పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు టీమ్. ఈ నెల 25న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.

Next Story