సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి : రష్మిక మందన్న

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-09 11:27:23  IST  )

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) భారత్ - పాక్ (India-Pakistan War)ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా ఒక స్టోరీ పోస్ట్ చేశారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ప్రశ్నించవద్దని అందులో పేర్కొన్నారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి : రష్మిక మందన్న
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాక్ యుద్ధం, ఆపరేషన్ సిందూర్ పై సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) భారత్ - పాక్ (India-Pakistan War)ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా ఒక స్టోరీ పోస్ట్ చేశారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ప్రశ్నించవద్దని అందులో పేర్కొన్నారు. ఒక దేశం ఉగ్రవాదం నుంచి తనను తాను కాపాడుకునేందుకు చేసే పోరాటం యుద్ధం కాదని, బలమైన స్పందనకు మద్దతు ఇచ్చేవారు యుద్ధపిపాసులు కాదని, వారు భద్రత, న్యాయం కోరుకునే పౌరులని ఆ స్టోరీలో రష్మిక రాసుకొచ్చారు.

"ప్రతిస్పందన లేని దాడి, అవసరమైన రక్షణ మధ్య లోతైన నైతిక తేడా ఉంది. ఉగ్రవాద చర్యలో అమాయకుల ప్రాణాలు పోయినప్పుడు, సమంజసమైన స్పందన బాధ్యతగా మారుతుంది. ప్రతిస్పందించే దేశాన్ని ప్రశ్నించవద్దు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నవారిని ప్రశ్నించు." అని రష్మిక పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలోనూ రష్మిక సోషల్ మీడియాలో స్పందించారు. ఈ దాడి గురించి తెలిసి తన గుండె ముక్కలైందని, బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని తెలిపారు.

Next Story