Rashmika: నెట్టింట వైరలవుతోన్న రష్మిక మందన్న పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే?

by Kodari Anjali |   (  Updated:2025-04-28 15:36:32  IST  )

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలే సికందర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Rashmika: నెట్టింట వైరలవుతోన్న రష్మిక మందన్న పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలే సికందర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మార్చి 30 థియేటర్లలోకి వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీలో హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించి జనాల్ని మెప్పించాడు. ఈ సినిమాను ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్‌తో పాటు సత్య రాజ్ కూడా కీలక పాత్రలో నటించారు.

ఇకపోతే ఈ నేషనల్ క్రష్ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప రెండు భాగాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. బాలీవుడ్‌ ప్రముఖ హీరో సరసన అవకాశం దక్కించుకుని మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

రణబీర్ కపూర్‌కు భార్యగా యానిమల్‌లో కనిపించి తన సత్తా చాటింది. ఇక రష్మిక మందన్న సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోని ఫ్యాన్స్‌తో మాత్రం తప్పకుండా టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సుల్లో ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్‌ను తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. ప్రజెంట్ రష్మిక మందన్న లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story