- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rashmika Mandanna: ‘దీని నుంచి నా చేతులను తీసివేయలేకపోయాను’.. క్యూట్ వీడియో పంచుకున్న నేషనల్ క్రష్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలే సికందర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలే సికందర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మార్చి 30 థియేటర్లలోకి వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీలో హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించి జనాల్ని మెప్పించాడు. ఈ సినిమాను ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్‌తో పాటు సత్య రాజ్ కూడా కీలక పాత్రలో నటించారు.
ఇకపోతే ఈ నేషనల్ క్రష్ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప రెండు భాగాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. బాలీవుడ్ ప్రముఖ హీరో సరసన అవకాశం దక్కించుకుని మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.
రణబీర్ కపూర్‌కు భార్యగా యానిమల్‌లో కనిపించి తన సత్తా చాటింది. ఇక రష్మిక మందన్న సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోని ఫ్యాన్స్‌తో మాత్రం తప్పకుండా టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అభిమానులతో ఓ బ్యూటిఫుల్ వీడియో పంచుకుని దీనికి ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘దీని నుంచి నా చేతులను తీసివేయలేకపోయాను. కాబట్టి మనం నిజంగా తీసిన దానికి బదులుగా దీన్ని పోస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. CMF ఫోన్ 2 ప్రో. మే 5, మధ్యాహ్నం 12 గంటల నుంచి మీది’’. అంటూ ఓ లవ్ సింబల్ జోడించింది.






