Rashmika Mandanna: "ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది".. రష్మిక మందన్న సంచలన పోస్ట్.. విజయ్ గురించేనా..?

by Gugulothu.Kavitha |

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Rashmika Mandanna: ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది.. రష్మిక మందన్న సంచలన పోస్ట్.. విజయ్ గురించేనా..?
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన ఫస్ట్ మూవీతోనే నేషనల్ క్రష్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీతో ఏకంగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే రీసెంట్‌గా ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘పుష్ప2’(Pushpa-2) వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మిక కూడా తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.

అలాగే తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. దీంతో ఈ భామకు ఎడతెరిపి లేకుండా ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఛావా’(Chhaava), ‘రెయిన్ బో’(Rainbow), ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ‘VD-14’, ‘సికిందర్’(Sikander) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ కొన్ని రోజులకే క్యాన్సల్ చేసుకుంది. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన కొన్ని సినిమాల్లో నటించి అతనితో ప్రేమలో పడింది.

ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు ఎప్పటినుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరు కలిసి వేకేషన్స్‌కి వెళ్ళడం, విజయ్ ఇంటికి రష్మిక వెళ్లడం వంటి పలు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. కానీ, ఈ రిలేషన్‌పై వారు ఇప్పటివరకు స్పందించలేదు. మరి ముందు ముందు అయినా స్పందిస్తారా లేదా చూడాలి. ఇదిలా ఉంటే.. రష్మిక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్‌, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

అందులో ‘కైండ్ ఫుల్’ అనే క్యాప్షన్‌తో ఉన్న టీ షర్ట్ వేసుకుని.. "ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి" అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది. కాగా విజయ్ దేవరకొండను ఉద్దేశించే రష్మిక ఈ పోస్ట్ పెట్టినట్టు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. నిన్న రష్మిక అండ్ విజయ్ దేవరకొండ ఇద్దరూ జిమ్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా నడవలేని స్థితిలో ఉన్న రష్మిక వాకర్ సాయంతో బయటకు వచ్చింది. కారు ఎక్కేందుకు ఆమె ఇబ్బంది పడుతున్నప్పటికీ విజయ్ రష్మికకు సాయం చేయలేదు. దీనిపై ఆమె అభిమానులు కూడా ఫుల్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రీసన్ వల్లనే ఆమె అందరిలో దయ తగ్గిపోయిందని పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

Next Story