రష్మిక మందన్న తదుపరి చిత్ర టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. గెస్ చేస్తే మీట్ అవుతా..

by Kodari Anjali |   (  Updated:2025-06-26 05:36:42  IST  )

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.

రష్మిక మందన్న తదుపరి చిత్ర టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. గెస్ చేస్తే మీట్ అవుతా..
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఏ ముహూర్తాన సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. లక్ బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పుష్ప రెండు భాగాలతో, యానిమల్, ఛావా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక రీసెంట్‌గా విడుదలైన కుబేర చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం కూడా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే నేషనల్ క్రష్ రష్మిక మందన్న తదుపరి చిత్రం అప్డేట్ ఇచ్చింది.

పోస్టర్‌ను షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది. మేము ఏమి పని చేస్తున్నామో మీకు చూపించడానికి చాలా ఉత్సాహంగా ఉంది. నా తదుపరి సినిమా టైటిల్ ను మీరు ఊహించగలరా? ఎవరూ నిజంగా ఊహించలేరని నేను అనుకుంటున్నాను. కానీ మీరు ఊహిస్తే మాత్రం నేను మిమ్మల్ని కలవడానికి వస్తానని మాట ఇస్తున్నాను. అని రాసుకొచ్చింది. వేటాడింది. గాయపడింది. విరగలేదు, అనేది సినిమా ట్యాగ్‌లైన్.. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్.. ఇతర వివరాలు రేపు వెల్లడిస్తామని చెప్పుకొచ్చింది. దీంతో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది.

Next Story