Rashmika Mandanna: ఐ మిస్ యూ అంటూ అతనికి బర్త్ డే విష్ చేసిన నేషనల్ క్రష్.. వైరల్‌గా మారిన పోస్ట్

by I. Sairam |

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌ అయిపోయింది.

Rashmika Mandanna: ఐ మిస్ యూ అంటూ అతనికి బర్త్ డే విష్ చేసిన నేషనల్ క్రష్.. వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌ అయిపోయింది. ఇక డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. రీసెంట్ ‘పుష్ప-2’తో మన ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వరస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రష్మిక మందన్న తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌తో ఉన్న ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు సుక్కు సార్.. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. అయితే నా దగ్గర మీ ఫొటోస్ చాలా ఉన్నాయి కానీ, ఇది నాకు వెరీ స్పెషల్ పిక్’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు డైరెక్టర్ సుకుమార్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Next Story