ఎట్టకేలకు అతనితో ఆ కోరిక తీర్చుకున్న రష్మిక !

by velandi.Saikiran |

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రష్మిక మందాన (Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పది

ఎట్టకేలకు అతనితో ఆ కోరిక తీర్చుకున్న రష్మిక !
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రష్మిక మందాన (Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పది సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ కొనసాగుతోంది. అప్పుడెప్పుడో వచ్చిన చలో, గీత గోవిందం లాంటి సినిమాలతో సక్సెస్ అయి అగ్ర హీరోలతో ఛాన్స్ లు కొట్టేసింది రష్మిక.

ఇక అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప రెండు భాగాల్లో హీరోయిన్ గా నటించి... ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించింది. అటు బాలీవుడ్ లో కూడా దుమ్ము లేపుతోంది. ఇలాంటి నేపథ్యంలో రష్మిక ఖాతాలో మరో విజయం పడింది. అక్కినేని నాగార్జున, హీరో ధనుష్, రష్మిక కాంబినేషన్ లో సరికొత్త సినిమా కుబేర ( Kuberaa) వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం వచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంటుంది.

కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో రష్మిక తో పాటు ధనుష్ (Dhanush) కూడా అద్భుతంగా నటించాడట. అయితే ఈ నేపథ్యంలోనే రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా చిరకాల కోరిక కుబేర సినిమాతో తీరిందంటూ కామెంట్ చేశారు రష్మిక. తనకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ( Shekhar kammula )ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు రష్మిక. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక... కుబేర సినిమాతో తీరిపోయిందని.. వెల్లడించారు. ఆయన వల్ల సమీరా పాత్రకు న్యాయం చేయగలిగానని గుర్తు చేసుకున్నారు రష్మిక.

Next Story