- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rashmika Mandanna: హారర్-కామెడీ సినిమాతో రాబోతున్న రష్మిక.. అతనితో మొదటిసారి జతకట్టబోతున్న నేషనల్ క్రష్.. కలిసొచ్చేనా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో వచ్చి ఘన విజయాన్ని సాధించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో వచ్చి ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వెంటనే హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) సరసన చేసి ‘ఛావా’(Chhaava) చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస హిట్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక మందన్నా కుబేర(Kubera), ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend) వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు యాడ్స్ చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది.
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా, రష్మిక మందన్న ఓ హారర్-కామెడీ చిత్రంతో రాబోతున్నట్లు సమాచారం. ఆదిత్య సర్పోత్దార్(Aditya Sarpotdar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui), పరేష్ రావల్, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ‘థమా’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా.. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే గత ఏడాది ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదలవగా.. పలు కారణాల వల్ల అప్డేట్స్ రిలీజ్ కాలేదు.
అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను మ్యాడ్‌డాక్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ఈ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక రష్మిక, అయుష్మాన్ ఖురానా కాంబోలో రాబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ కాంబో ప్రేక్షకులను మెప్పిస్తుందా? అని అనుమాన పడుతున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
#RashmikaMandanna kicks off shoot for #MaddockFilms's #Thama in scenic Ooty! Teaming up with #AyushmannKhurrana for the first time in this horror-comedy set to release this Diwali.#RashmikaMandanna #Thama #AyushmannKhurrana #MaddockFilms #Pushpa2 #Diwali2025 #sidk… pic.twitter.com/vUuCmK75TN
— Siddharth R Kannan (@sidkannan) April 29, 2025






