- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైసా కోసం ఆ రాష్ట్రంలో రష్మిక
మైసా మూవీ లేటెస్ట్ షెడ్యూల్ కేరళలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్న ప్రస్తుతం 'మైసా' అనే పవర్‌ఫుల్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్‌గా జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ కేరళలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రక్తపు మరకలు ఉన్న చేతితో కత్తి పట్టుకున్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది. దాని కింద 'మైసా' షూటింగ్‌లో భాగంగా ఈ ఫోటోను పోస్ట్ చేస్తున్నట్లు ఆమె తెలియజేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాల ద్వారా ఇది భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. తాజాగా రష్మిక చేసిన పోస్ట్ ద్వారా ఇందులో రక్తపాతం కూడా భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే ఈమెకు సరికొత్త ఇమేజ్ వచ్చే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 'అర్ధ శతాబ్దం' ఫేమ్ రవీంద్ర పుల్లె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్ ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






