- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక రొమాంటిక్ కామెడీ..ట్రైలర్ వచ్చేసింది
రష్మిక నటించిన కాక్ టెయిల్ 2 రొమాంటిక్ కామెడీ సినిమా ట్రైలర్ వచ్చేసింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ డం తెచ్చుకున్న ఈ అందాల తార... ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది. ఆమె చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ వరకు ఆమె క్రేజ్ పాకింది. లేటెస్ట్ గా పెళ్లి చేసుకున్న రష్మిక, తన దూకుడును ఎక్కడ తగ్గించడం లేదు.
ఈ క్రమంలోనే కాక్ టెయిల్ 2 సినిమాలో నటించి మెప్పించేందుకు సిద్ధమైంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ముగ్గురు ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన రొమాంటిక్ సినిమానే ఈ కాక్‌టెయిల్ 2. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రేజీ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో ముగ్గురి మధ్య వచ్చే కామెడీ, ఎమోషన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.






