రామ్ పోతినేని బర్త్ డే నాడు ‘రాపో-22’ అప్డేట్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా.. ఫుల్ ఖుషీలో అభిమానులు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) గత ఏడాది ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో వచ్చిన హిట్ అందుకున్నాడు.

రామ్ పోతినేని బర్త్ డే నాడు ‘రాపో-22’ అప్డేట్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా.. ఫుల్ ఖుషీలో అభిమానులు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) గత ఏడాది ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో వచ్చిన హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’(Rapo-22). ఈ చిత్రాన్ని యువ దర్శకుడు మహేష్ బాబు(Mahesh Babu) తెరకెక్కిస్తుండగా.. టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో రామ్ పోతినేని సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇందులో రామ్ సాగర్ పాత్రలో నటిస్తుండగా.. భాగ్యశ్రీ మహాలక్ష్మిగా కనిపించబోతుంది.

ఇక షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకర్శించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘రాపో-22’ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. మే 15వ తేదీన రామ్ పుట్టినరోజు కానుకగా ‘రాపో-22’ ఫస్ట్ సింగిల్ విడుదల చేసి అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వివేక్, మార్విన్ పాడిన ఈ సాంగ్ తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసేవిధంగా ఉంటుందని టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన రామ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story