పవన్‌ కన్నా రానాకే ఎక్కువ.. ఆర్జీ‌వీ హాట్ కామెంట్స్

by Web Desk |
పవన్‌ కన్నా రానాకే ఎక్కువ.. ఆర్జీ‌వీ హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా : క్రియేటివ్ జీనియస్ రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. పవర్‌స్టార్ నటించిన 'భీమ్లా నాయక్‌' మూవీ ట్రైలర్‌పై తనదైన శైలిలో స్పందించిన ఆయన.. వరుస ట్వీట్లతో కొత్త చర్చకు తెరలేపారు. ట్రైలర్‌ చూశాక 'భీమ్లా నాయక్‌'కు బదులు 'డానియల్ శేఖర్' అని టైటిల్ పెట్టి ఉండాల్సిందన్న ఆర్‌జీవీ.. 'బాలీవుడ్‌లో పవన్‌ కళ్యాణ్‌ కంటే రానాకే ఎక్కువ పాపులారిటీ ఉంది. అతన్ని ఈ సినిమాలో విలన్‌గా పెట్టుకున్నారు. అయితే, అక్కడ రానానే హీరో అనుకునే ప్రమాదం ఉంది. నిజానికి పవన్‌కు అత్యంత సన్నిహితులైన ఈ మూవీ మేకర్స్ దీనికి ఎలా ఒప్పుకున్నారు?' అని ప్రశ్నించారు. రానా పాపులారిటీ పెంచేందుకే పవన్‌ కళ్యాణ్‌ను తగ్గించినట్లు కనిపిస్తోందని, ట్రైలర్‌ చూసి పవన్‌ అభిమానిగా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వర్మ ట్వీట్లపై పీకే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


From watching #BheemlaNayakTrailer it looks like the makers for some reason have used and abused @PawanKalyan to promote @RanaDaggubati ..I am hurted as a fan of P K


Next Story

Most Viewed