పెళ్లిలో సు..సు.. పోసుకునేందుకు ఓ బౌల్.. హీరో సెన్సేషనల్ కామెంట్స్.. నిజంగా అంతసేపు జరుగుతుందా?

by Sujitha Rachapalli |

హీరో రణ్‌దీప్ హుడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. మణిపురి ట్రెడిషన్‌లో జరిగిన వివాహ మహోత్సవంలో మొత్తానికి రీల్ హీరో రియల్ లైఫ్ హజ్బెండ్ అయిపోయాడు. అయితే సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ మ్యారేజ్.. కొన్ని గంటలపాటు కొనసాగిందని తెలిపాడు హీరో.

పెళ్లిలో సు..సు.. పోసుకునేందుకు ఓ బౌల్.. హీరో సెన్సేషనల్ కామెంట్స్.. నిజంగా అంతసేపు జరుగుతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరో రణ్‌దీప్ హుడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. మణిపురి ట్రెడిషన్‌లో జరిగిన వివాహ మహోత్సవంలో మొత్తానికి రీల్ హీరో రియల్ లైఫ్ హజ్బెండ్ అయిపోయాడు. అయితే సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ మ్యారేజ్.. కొన్ని గంటలపాటు కొనసాగిందని తెలిపాడు హీరో. ఆ రోజే ఆధ్యాత్మికత అనుభూతిని పూర్తిగా ఆస్వాదించానని తెలిపాడు. తన లైఫ్‌లోనే ఇది చాలా ప్రత్యేక స్పిరిచ్యువల్ మూమెంట్‌గా వర్ణించాడు. అయితే ఇంత గొప్పగా జరిగిన వివాహంలో ఓ జోక్ కూడా చెప్పాడు.

నిజానికి ట్రెడిషనల్ వేలో పెళ్లి జరుగుతుందంటే.. చాలా సేపు పడుతుంది. కనీసం యూరిన్ వెళ్లే అవకాశం కూడా ఉండదు. కూర్చున్న దగ్గరి నుంచి లేచే చాన్స్ ఇవ్వరు. కాబట్టి తనకు సు..సు.. పోసుకునేందుకు ప్రత్యేక బౌల్ కూడా ఇచ్చారని తెలిపాడు. ఒకవేళ సు..సు.. వస్తే అందులో పోసుకోవడమే తప్ప.. పక్కకు జరిగే చాన్స్ ఉండదు. ఈ విషయం విన్న ఫ్యాన్స్ పడి పడి నవ్వారు. కాగా పెళ్లికి ముందు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన రణ్‌దీప్.. దాని నుంచి బయటపడి చక్కగా పెళ్లి చేసుకోవడమే కాదు ఇప్పుడు హ్యాపీగా ఉండటం చూసి అభిమానులు ఆనందపడుతున్నారు.

LINK

Next Story