- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ranbir Kapoor: యానిమల్- 3 టైటిల్ ప్రకటించిన రణబీర్ కపూర్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

దిశ, వెబ్‌డెస్క్: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన యానిమల్(Ranbir Kapoor) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రణబీర్(Ranbir Kapoor) హీరోగా.. రష్మిక మందన్న(Rashmika Mandanna) కథానాయికగా నటించిన ఈ సెన్సేషనల్ మూవీ దాదాపు 900 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం విశేషం. ఇందులో పలు సన్నివేశాల్లో నటి త్రిప్తి డిమ్రి(Tripti Dimri) కూడా నటించి.. మూవీలో హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా తండ్రి కొడుకుల ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గురించి తాజాగా హీరో రణబీర్ కపూర్ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు.
యానిమల్ -2 నే కాదు.. యానిమల్ 3 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పి ఫ్యాన్స్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదు. అంతేకాకుండా రణబీర్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. పార్ట్-3 యానిమల్ పార్క్(Animal Park) అనే టైటిల్‌తో రానుందని ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. ఇక రెండో భాగం 2027 లో ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియనప్పటికీ.. యానిమల్ మూవీ గురించి వదులుతున్న అప్డేట్స్ మాత్రం జనాల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ప్రస్తుతం రణబీర్ యానిమల్ -3 గురించి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రణబీర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.






