- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది నిజమైన పొట్ట కాదా.. యానిమల్‌లో రన్ బీర్ లుక్ పై ఇంట్రెస్టింగ్ వీడియో
రణ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో సైతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: రణ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో సైతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో రణ బీర్ గాయాలపై రెస్ట్ తీసుకుంటున్న సమయంలో భారీగా బరువు పెరిపోతాడు. ఆ సమయంలో బరువైన వ్యాయామాలు చేయవద్దని చెప్పడంతో రణ బీర్ బరువు అమాంతం పెరిగిపోతాడు. తరవాత ఆరోగ్యంగా తయారైన వెంటనే మళ్లీ వ్యాయామాలు చేసి బరువు తగ్గుతాడు. బరువు పెరిగిన సమయంలో రణ బీర్ పొట్ట నిజమైన పొట్టలాగే కనిపిస్తుంది. కానీ ఇది ఫేక్ పొట్ట అంటూ వీడియో వైరల్ అవ్వడంతో సినిమా చూసిన ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. ఫేస్ మాస్కులు ఎలా తయారు చేస్తారో ఆ పొట్టను కూడా అలాగే తయారు చేసినట్టు వీడియోలో చూపించారు. వీడియో వైరల్ అవ్వడంతో దీనిని తయారు చేసినవాళ్లు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపైనా ప్రశంసలు కురిపిస్తున్నారు.






