‘రానా నాయుడు-2’ స్ట్రీమింగ్ తేదీ ఖరారు.. అధికారిక ప్రకటన విడుదల కావడంతో ఫుల్ ఖుషీలో సినీ ప్రియులు

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-20 13:10:29  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) కాంబోలో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఎంతలా ప్రేక్షకులను ఆదరించిందో అందరికీ తెలిసిందే.

‘రానా నాయుడు-2’ స్ట్రీమింగ్ తేదీ ఖరారు.. అధికారిక ప్రకటన విడుదల కావడంతో ఫుల్ ఖుషీలో సినీ ప్రియులు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) కాంబోలో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఎంతలా ప్రేక్షకులను ఆదరించిందో అందరికీ తెలిసిందే. రెండేళ్ల కిందట నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ సిరీస్ బూత్ కంటెంట్ కారణంగా విమర్శల పాలై సంచలనం సృష్టించింది. అలాగే ఈ సిరీస్ కొంతమంది ప్రేక్షకులను అలరించి ప్రశంసలు కూడా పొందింది. ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుంది. తాజాగా, ‘రానా నాయుడు-2’(Rana Naidu-2)పై మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సిరీస్ జూన్ 13నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘కుటుంబం విషయానికి వస్తే రానా అన్ని హద్దులూ దాటేస్తాడు’’ అనే క్యాప్షన్ జత చేస్తూ పోస్ట్ పెట్టారు.

అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో అర్జున్ రాంపాల్ గొడ్డలి పట్టుకుని ఉండగా.. రానా క్రికెట్ బ్యాట్ పట్టుకుని కోపం చూస్తున్నాడు. ఇక పక్కన వెంకటేష్, ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఈ సిరీస్‌లో రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జుల్ రాంపాల్, సుర్వీన్ చావ్లా(Surveen Chawla), కృతి ఖర్బందా(Kriti Kharbanda), సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee), డినో మోరియా కీలక పాత్రలో నటించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సీరిస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించడంతో సినీ ప్రియులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story