Dulquer Salmaan: రోల్.. కెమెరా.. యాక్షన్.. దుల్కర్ సల్మాన్ మూవీ అప్డేట్ ఇచ్చిన రానా

by Chukka Sudharani |

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

Dulquer Salmaan: రోల్.. కెమెరా.. యాక్షన్.. దుల్కర్ సల్మాన్ మూవీ అప్డేట్ ఇచ్చిన రానా
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను 1950 మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరిమైన నాటకీయ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన దుల్కర్, భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చాడు రానా. ‘విడుదలకు మార్గం మొదటి టీజర్‌తో స్టార్ట్ అవుతోంది.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాబోతున్న టీజర్ కోసం వేచి ఉండండి.. రోల్.. కెమెరా.. యాక్షన్!’ అంటూ ఓ వీడియో షేర్ చేశారు. కాగా.. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో ఒకరైన సురేష్ ప్రొడక్షన్స్, వేఫారేర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ యాక్టర్ సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లింక్

Next Story