- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంజాన్ స్పెషల్.. ‘ఓదెల-2’ నుంచి లెజెండరీ యాక్టర్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల-2’(Odela-2).

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల-2’(Odela-2). అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. సంపత్ నంది కథా రచయితగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇందులో హెబ్బా పటేల్(Hebba Patel), వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ‘ఓదెల రైల్యే స్టేషన్’ కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీలో తమన్నా నాగసాధువుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
అయితే ‘ఓదెల-2’ చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ పలు అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, రంజాన్ పండుగ సందర్భంగా మూవీ మేకర్స్ అదిరిపోయే పోస్టర్‌ను షేర్ చేశారు. లెజెండరీ యాక్టర్ మురళి శర్మ ‘ఓదెల-2’ సినామాలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్‌ను నెట్టింట పెట్టారు. అయితే ఇందులో ఆయన ‘అల్హా బక్షు’ పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మురళీ శర్మ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
Team #Odela2 wishes everyone a Happy Ramadan 🌙
— BA Raju's Team (@baraju_SuperHit) March 31, 2025
On this special day, introducing the Legendary #MuraliSharma Garu as 'ALLAH BAKSHU' from #Odela2 ❤🔥
GRAND WORLDWIDE RELEASE ON APRIL 17th 💥💥#Odela2onApril17 @tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ihebahp… pic.twitter.com/4RQcvbTLOj






