Ramya Pandian : గ్లామర్ షోతో సముద్రానికే హీట్ పెంచుతున్న రమ్య పాండియన్

by Pulgam srinivas |   (  Updated:2026-05-30 13:39:39  IST  )

హాట్ అందాలతో సముద్ర తీరాన సెగలు రేపుతున్న రమ్య పాండియన్

Ramya Pandian : గ్లామర్ షోతో సముద్రానికే హీట్ పెంచుతున్న రమ్య పాండియన్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో రమ్య పాండియన్ ఒకరు. ఎక్కువగా కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ, నటనతో పాటు అందాలతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

1990 ఆగస్టు 13న తమిళనాడులోని తిరునెల్వేలిలో జన్మించిన రమ్య, అన్నా యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2013లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఈ యంగ్ బ్యూటీ 2015లో విడుదలైన ‘డమ్మీ టప్పాసు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.

అనంతరం వరుసగా తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమాల్లో తన నటనతో పాటు గ్లామర్‌తోనూ ఆకట్టుకునే రమ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

తరచూ హాట్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో స్కై బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో సముద్ర తీరంలో నడుస్తూ హాట్ ఫోజులు ఇచ్చిన రమ్య, తన అందాలతో నెటిజన్లను ఫిదా చేసింది.

వాటిలో ఆమె సూపర్ హాట్ లుక్‌లో కనిపించడంతో ఈ ఫోటోలు నెటింట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ కి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా లైక్స్ దక్కుతుండగా, ఆమె అందాన్ని పొగుడుతూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Photos Courtesy: Instagram

Next Story