షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన రామ్ హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్(పోస్ట్)

by I. Sairam |

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన రామ్ హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో బ్లూ టీ షర్ట్, వైట్ షార్ట్ వేసుకుని నెత్తిన క్యాప్ పెట్టుకుంది. అలాగే హెయిర్ లీవ్ చేసుకుని ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటికి.. ‘8 ఏళ్ల బాలుడిలా పనికి వెళ్లే ఆ ఆదివారాల్లో ఇది ఒకటి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అసలు ఏమైంది నీకు అలా గుర్తుపట్టకుండా అయ్యావ్ అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story