Ram Pothineni: రామ్ పోతినేని బర్త్ డే స్పెషల్.. డబుల్ అప్డేట్స్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-15 06:59:37  IST  )

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22(’Rapo-22).

Ram Pothineni: రామ్ పోతినేని బర్త్ డే స్పెషల్.. డబుల్ అప్డేట్స్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22(’Rapo-22). మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ నటుడు ఉపేంద్ర కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే దీనిని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో రామ్ సాగర్ పాత్రలో నటిస్తుండగా.. భాగ్యశ్రీ మహాలక్ష్మిగా కనిపించనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు అంచనాలను పెంచాయి. నేడు రామ్ పుట్టినరోజు కావడంతో మూవీ మేకర్స్ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.

‘రాపో-22’చిత్రం నుంచి డబుల్ అప్డేట్స్ విడుదల చేసి సర్‌ప్రైజ్ చేశారు. రామ్ బర్త్ డే కానుకగా టైటిల్, గ్లింప్స్ వదిలారు. ఇక ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రకటిస్తూ రామ్ మాస్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక గ్లింప్స్ గమనించినట్లైతే.. ఇందులో ఓ ఆంధ్రా కింగ్ సూర్య సినిమాకు థియేటర్‌కు ఫోన్ చేసి టికెట్స్ బుక్ చేసుకుంటుంటే.. ఓ వైపు ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. అలా ఎమ్‌ల్యేకు కొన్ని టికెట్స్ అని పక్కట పెట్టగా.. ఈక్రమంలో రామ్ వచ్చి 50 టికెట్స్ అడుగుతాడు. ఎవరి తాలూకా అని అడగ్గా ఫ్యాన్స్ అనగానే ఇచ్చేస్తాడు. అయితే రామ్ ఉపేంద్ర బాబు ఫ్లెక్సీ వద్దకు వెళ్లి సందడి చేయడంతో పాటు ఆంధ్రా కింగ్ తాలుకా అని అరుస్తాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

Next Story