Peddi: జాన్వీ క‌పూర్‌ తో శ్రీలంక‌లో చ‌ర‌ణ్ ల్యాండ్ !

by velandi.Saikiran |

రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా శ‌రావేగంగా షూటింగ్

Peddi: జాన్వీ క‌పూర్‌ తో శ్రీలంక‌లో చ‌ర‌ణ్ ల్యాండ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా శ‌రావేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ హీరోయిన్ గా మెరుస్తున్నారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సరసన శ్రీదేవి నటించగా, ఇప్పుడు రామ్ చరణ్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ నటిస్తుందన్నమాట. దీంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

జగపతిబాబు, శివ రాజుకుమార్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. మార్చి 2026లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. జాన్వీ, చరణ్ మధ్య రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. అయితే ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా శ్రీలంకకు వెళ్ళింది చిత్రం బృందం. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ శ్రీలంకకు చేరినట్లు వీడియో వైరల్ గా మారింది. ఇందులో జాన్వీ కపూర్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించారు. క్లిక్

Next Story