‘రమణి కళ్యాణం’ ప్రయాణం స్టార్ట్..

by Chukka Sudharani |

విజయ్ ఆదిరెడ్డి(Director Vijay Adireddy) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రమణి కళ్యాణం’(Ramani Kalyanam).

‘రమణి కళ్యాణం’ ప్రయాణం స్టార్ట్..
X

దిశ, సినిమా: విజయ్ ఆదిరెడ్డి(Director Vijay Adireddy) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రమణి కళ్యాణం’(Ramani Kalyanam). దీప్శిక(Deepshika), సూర్య వశిష్ట (Surya Vasishta)ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా టైటిల్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), వశిష్ట, విజయ్ ఆంటోని(Vijay Antony), జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై టైటిల్ లుక్‌ను లాంచ్ చేసి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్‌తో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోంది. వినోదం, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పబోతోతున్నామని తెలిపారు చిత్ర బృందం. ఈ చిత్రానికి సూరజ్ ఎస్ కురుప్ మ్యూజిక్ అందిస్తున్నారు. కోర్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రామ్ జగదీష్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ‘రమణి కళ్యాణం’ తన అందమైన ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి అని తెలిపారు.

Next Story