- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naari Movie: రీ ఎంట్రీలో మరో పాట పాడిన రమణ గోగుల.. ఎలా ఉందంటే?
" సంక్రాంతికి వస్తున్నాం " ( Sankranthiki vasthunam ) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు

దిశ, వెబ్ డెస్క్ : సింగర్ రమణ గోగుల ( Ramana Gogula) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. " సంక్రాంతికి వస్తున్నాం " ( Sankranthiki vasthunam ) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో పాడిన " గోదారి గట్టు " ( Godari Gattu Meedha ) పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. ఆ సాంగ్ కోసమే థియేటర్ కి ఎంతో మంది జనాలు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ పాటతో రమణ గోగుల చాలా ఫేమస్ అయ్యాడు. ఇప్పటికి పవర్ స్టార్ ఫ్యాన్స్ " బంగాళా ఖాతంలో " అనే పాటను గ్రూప్స్ లో షేర్ చేస్తుంటారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ము దులుపుతున్న రమణ గోగుల తాజాగా మరో పాటను పాడారు. ఈ పాటను బుధవారం రిలీజ్ చేశారు. నారి (Naari ) మూవీ నుంచి రెండు పాటలు విడుదలై అందర్ని మెప్పించాయి. తాజాగా శివరాత్రి సందర్భంగా స్టార్ సింగర్ రమణ గోగుల పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే..’ పాటను విడుదల చేశారు. వినోద్ కుమార్ విన్ను సంగీతాన్ని అందివ్వగా.. ప్రసాద్ సాన ( prasad sana ) రాసిన లిరిక్స్ రాశారు. ప్రస్తుతం, ఈ సాంగ్ కూడా యూట్యూబ్ లో వైరల్ అవుతుంది.
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని.. తదితర నటీ నటులు ముఖ్య పత్రాలు పోషించారు. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి.. పైకి వచ్చేందుకు వారు ఎన్ని కష్టాలు పడ్డారనేది కథ. దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శశి వంటిపల్లి నిర్మాణంలో వస్తున్న " నారి " (Naari ) సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.






