వివాదంలో రాజ‌మౌళి...రమా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

by velandi.Saikiran |

రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రమా ( Rama Rajamouli). రాజమౌళికి డబ్బులపైన ఆలోచన అస్సలు ఉండదని

వివాదంలో రాజ‌మౌళి...రమా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి ( Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి, టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు రాజమౌళి. అలాంటి రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ కూడా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హనుమంతుడిపై రాజమౌళి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. దానికి తగ్గట్టుగానే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. రాజమౌళి సినిమాలు చూడకూడదని కూడా వింత వాదన తెరపైకి తీసుకువస్తున్నారు.

అయితే ఇలాంటి నేపథ్యంలో రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రమా ( Rama Rajamouli). రాజమౌళికి డబ్బులపైన ఆలోచన అస్సలు ఉండదని పేర్కొన్నారు. ఆయన డబ్బుల మనిషి కాదని వివరించారు. జేబులో కూడా ఒక్క రూపాయి కూడా ఉంచుకోబోరని తెలిపారు. అయితే తానే రాజమౌళికి తెలియకుండా ఆయ‌న‌ కారు డ్రైవర్ కు క్యాష్ తో పాటు కార్డ్ ఇస్తానని రమా స్పష్టం చేశారు. అంతేకాదు రాజ‌మౌళి సిగ్నేచర్ వల్ల చెక్కులు చాలా రిజెక్ట్ అయ్యాయని, అందుకే ఆ అథారిటీని కూడా తానే తీసుకున్నట్లు రమా తెలిపారు.

Next Story