హీరో రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్

by Sujitha Rachapalli |

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఈ మధ్య ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.

హీరో రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్
X

దిశ, సినిమా : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఈ మధ్య ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఓ అభిమాని బయోపిక్ మాదిరిగా వచ్చిన చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టలేకపోయింది. కాగా తాజాగా రామ్ కొత్త సినిమా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో రాబోతుందని టాక్. కాగా జోనర్ పరంగా కొత్త కథ అని.. బడ్జెట్ కూడా ఎక్కువేనని.. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని సమాచారం. కాగా ఇందులో కూడా తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సె కథానాయికగా నటించబోతుందని సమాచారం.

Next Story