ఆ తేదీన రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్?

by Pulgam srinivas |

రామ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ మే 15న వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఆ తేదీన రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నెక్స్ట్ మూవీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆయన నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. వరుస అపజయాల తర్వాత వచ్చిన ఈ సినిమా రామ్‌కు కొంత ఊరటను ఇచ్చింది. ఈ మూవీ తర్వాత రామ్ తన కోసం ప్రత్యేకంగా ఓ కథను సిద్ధం చేసుకున్నట్లు, దానిని తెరకెక్కించేందుకు సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పలువురు దర్శకుల పేర్లు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ తాను రాసుకున్న కథలో హీరోగా నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ చైతన్య నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్ మే 15న వెలువడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. తానే కథ రాసుకుని, హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story