కులాల కుమ్ములాట.. సర్వం కోల్పోయిన హీరో రామ్ పోతినేని కుటుంబం

by Sujitha Rachapalli |

‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. జగపతి బాబు హోస్టింగ్ సున్నితంగా సుత్తిలేకుండా సాగుతుండగా.. నాగార్జున, శ్రీలీల, నాగ చైతన్య, సందీప్ రెడ్డి వంగా, ఆర్జీవీ లాంటి సెలబ్రిటీల స్టోరీలు, సక్సెస్ జర్నీలతో ఆడియన్స్‌ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు

కులాల కుమ్ములాట.. సర్వం కోల్పోయిన హీరో రామ్ పోతినేని కుటుంబం
X

దిశ, వెబ్ డెస్క్ : ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. జగపతి బాబు హోస్టింగ్ సున్నితంగా సుత్తిలేకుండా సాగుతుండగా.. నాగార్జున, శ్రీలీల, నాగ చైతన్య, సందీప్ రెడ్డి వంగా, ఆర్జీవీ లాంటి సెలబ్రిటీల స్టోరీలు, సక్సెస్ జర్నీలతో ఆడియన్స్‌ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నాణేనికి ఒకవైపు మాత్రమే మనకు తెలుసని.. రెండో వైపు గురించి బయటకు తెస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్జీవీ లాంటి వ్యక్తిలోనూ ఇతరుల కోసం త్యాగం చేసే గుణం ఉందని గుర్తించేలా చేశాడు. మనకు కనిపించే స్టార్స్ వెనుక తెలియని ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయని చెప్తున్నాడు.

ఇక తాజా ఎపిసోడ్‌లో రామ్ పోతినేని అతిథిగా హాజరుకాగా.. కులం గొడవలతో తన కుటుంబం ఎంత నరకం అనుభవించిందో చెప్పుకొచ్చాడు. ‘నేను పుట్టిన తర్వాత విజయవాడలో కులాల కొట్లాటలు చెలరేగాయి. దీంతో ఒక్కరాత్రిలోనే నా కుటుంబం మొత్తం కోల్పోయి. మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. మేము చెన్నైకి వెళ్లిపోయాం. ఆ ట్రాన్సిషన్ నిజంగా నాకు షాక్ అనిపించింది. అందుకే మా నాన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్’ అని చెప్పుకొచ్చాడు.

Next Story