Game changer: కలెక్షన్స్‌ విషయంలో అబద్దం చెప్పి మోసం చేశారంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్..

by Hamsa |   ( Updated:2025-01-14 14:17:09.0  )
Game changer: కలెక్షన్స్‌ విషయంలో అబద్దం చెప్పి మోసం చేశారంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) అందరికంటే భిన్నంగా పోస్టులు చేస్తూ సంచలనం సృష్టిస్తుంటారు. తనకు ఏది అనిపిస్తే అది చెప్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఆయన సినిమాలు తెరకెక్కించిన దానికంటే సోషల్ మీడియాలోని పోస్టుల వల్లే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ‘శారీ’(Saree) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. ‘గేమ్ చేంజర్’(Game Changer) కలెక్షన్స్‌ను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు.

‘‘గేమ్ చేంజర్‌కు రూ. 450కోట్లు ఖర్చు చేస్తే.. ఈ లెక్కన రాజమౌళి(Rajamouli) ఆర్ఆర్ఆర్‌కు రూ. 4500 కోట్లు అయి ఉంటుంది. అలా గేమ్ చేంజర్‌కు మెదటి రోజు కలెక్షన్స్ రూ. 186 కోట్లు వచ్చాయంటే.. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రానికి రూ. 1860 కోట్లు రావాల్సింది. ఇక్కడ ఏదైనా నిజానికి కావాల్సిన ప్రాథమిక సూత్రం ఏంటంటే.. నిజమనేది నమ్మదగినదిగా ఉండాలి. అబద్ధం చెప్పినా కూడా నమ్మేలా ఉండాలి’’ అంటూ రాసుకొచ్చారు. కాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం జనవరి 10న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌‌ను సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన రోజే సోషల్ మీడియాలో హెచ్‌డీ ప్రింట్ లీక్ కావడంతో ఎవరూ థియేటర్స్‌కు వెల్లడం లేదు.

Advertisement

Next Story